ప్రధాని మోదీని నిలదీయాలి:ఆది శ్రీనివాస్

5
- Advertisement -

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు వైఖరి బీసీ వ్యతిరేకిగా కనిపిస్తోంది అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీ రిజర్వేషన్ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదు అన్నారు.

మైనార్టీ రిజర్వేషన్లకు అడ్డం పెట్టి బీసీలకు అన్యాయం చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది అని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రధాని మోదీని రామచందర్ రావు నిలదీయాలి అని డిమాండ్ చేశారు.

ఈటల, ధర్మపురి అరవింద్ ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదు?… బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పనే లక్ష్యంగా కులగణన చేశాం, మంత్రి వర్గంలో ఆమోదించాం, అసెంబ్లీలో చట్టం చేశాం, గవర్నర్ కు పంపాం అన్నారు. 9వ షెడ్యూల్ లో చేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు.

Also Read:ధన్‌ఖడ్ రాజీనామాకు కారణం ఇదే!

- Advertisement -