ప్రేమకావాలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో ఆది సాయికుమార్. ఈ సినిమా తర్వాత పలు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన ఆది ఇప్పటివరకు సోలో హిట్ అందుకోలేదు. తాజాగా వరుస సినిమాలతో ఈ సంవత్సర అలరించేందుకు ముందుకువస్తున్నాడు.
ఒక్క మెదడుతోనే ఎన్నో విషయాలు ఆలోచించగలుగుతున్నాం. అదే రెండు మెదళ్లు ఉంటే? ఇదే కాన్సెప్ట్‌తో ‘బుర్ర కథ’ చిత్రంతో వస్తున్నారు ఆది. తాజాగా సినిమాలో ఆది సాయికుమార్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. డిఫరెంట్ షేడ్స్‌తో సరికొత్త హెయిర్ స్టైల్‌తో ఆది ఆకట్టుకుంటున్నాడు.
రచయిత డైమండ్ రత్నబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా మారగా… దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్.కె.శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మించారు. కథానుగుణంగానే ఫస్ట్ లుక్‌ను రెండు షేడ్స్‌లో ఉండేలా డిజైన్ చేసి విడుదల చేశారు. షూటింగ్ పూర్తైన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సమ్మర్లో సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రల్లోనటించారు.