ఓటీటీలో అమెజాన్…’డ్రైవ్’!

6
- Advertisement -

‘అఖండ 2’తో పాటు అదే రోజున ఆది పినిశెట్టి నటించిన మరో సినిమా కూడా విడుదలైంది. అయితే సరైన ప్రమోషన్లు లేకపోవడంతో ఆ చిత్రం పెద్దగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ‘డ్రైవ్’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ తెలుగు రివెంజ్ డ్రామా భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందింది. థియేటర్లలోకి మౌనంగా వచ్చిన ఈ సినిమా పెద్దగా చర్చకు రాకుండానే థియేటర్ల నుంచి నిష్క్రమించింది.

తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ఓటీటీ రిలీజ్‌గా విడుదల చేశారు. తెలుగు వెర్షన్‌తో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అయితే థియేటర్లలో చూసిన ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం, సినిమా నెమ్మదిగా సాగుతూ పెద్దగా ఆకట్టుకోలేదనే విమర్శలు ఉన్నాయి.

జెన్యూస్ మహమ్మద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, మడోన్నా సెబాస్టియన్, రాజా చెంబోలు, కమల్ కమరాజు, అనీష్ యోహాన్ కురువిల్లా కీలక పాత్రల్లో నటించారు.

Also Read:పోలీసుల అదుపులో మావోయిస్టు దేవా!

- Advertisement -