ఆధార్ అప్‌డేట్.. గడువు పొడిగింపు

8
- Advertisement -

ఆధార్ కార్డు అప్‌డేట్ గడువును మరోసారి పొడగించినట్లు యూఐడీఏఐ తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా ఆధార్ కార్డులో ఏదైనా అప్‌డేట్ చేసుకోవాలంటే, ఆ డెడ్‌లైన్‌ను ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 14వ తేదీ వ‌ర‌కు పొడిగించారు.

వాస్తవానికి జూన్ 14 వ‌ర‌కే ఆధార్ అప్‌డేట్‌ను డెడ్‌లైన్‌గా విధించారు. బ‌యోమెట్రిక్‌, డెమోగ్రాఫిక్ డేటా స‌రిగ్గా ఉండాల‌న్న ఉద్దేశంతో ఆధార్‌ను అప్‌డేట్ చేసే తేదీని పొడిగించిన‌ట్లు యూఐడీఏఐ తెలిపింది.

ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రెస్, పుట్టిన రోజు, వ‌య‌సు, లింగం, మొబైల్ నెంబ‌ర్‌, ఈమెయిల్ అడ్ర‌స్‌, రిలేష‌న్‌షిప్ స్టేట‌స్ లాంటి వివ‌రాల‌ను మార్చుకోవ‌చ్చు. అయితే ఆన్‌లైన్‌లో జ‌రిగే ఆధార్ అప్‌డేట్‌లో ఐరిస్ స్కాన్లు, ఫింగ‌ర్ ప్రింట్స్‌, ఫేషియ‌ల్ ఫోటోగ్రాఫ్‌ల‌ను మార్చ‌డం కుద‌ర‌దు.

Also Read:ద‌క్షిణాఫ్రికా అధ్య‌క్షుడిగా సిరిల్ రామాఫోసా

- Advertisement -