గ్రేటర్ పరిధిలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న పబ్ కల్చర్‌కు బ్రేక్ వేసేందుకు సర్కార్ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పబ్‌లపై నిఘా పెంచిన ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.పబ్‌లకు వెళ్లాలంటే ఆధార్ తప్పనిసరి అంటూ నిబంధనలను జారీ చేసింది. ఇప్పటికే ఆధార్‌ను పాన్, మొబైల్, ఆర్థిక సంస్థలు, సాంఘిక భద్రత స్కీమ్‌లకు తప్పనిసరి చేయగా తాజాగా పబ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఆధార్ తప్పనిసరి అంటూ ఆదేశాలు తీసుకొచ్చింది.
గతంలో ఏదైనా ఐడెంటిటీ కార్డు చూపిస్తే పబ్‌లోకి ఎంటర్ కానిచ్చేవారు. కానీ ఇప్పటి నుంచి అది కుదరదు. డ్రగ్స్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ సిటీ పబ్‌లపై నిఘా పెట్టింది. పబ్ అడ్డాగా కొకైన్, ఎల్‌ఎస్‌డీల వినియోగం ఎక్కువగా పెరిగినట్లు పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో నిబంధనలను మరింత కఠినం చేశారు.
ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ తప్పకుండా తీసుకువెళ్లాలి. ఆధార్ వల్ల అండర్ ఏజ్ వ్యక్తులను గుర్తించవచ్చు. ఐడెంటీ కార్డు అనేది కొత్త రూల్ కాదు అని, ఆధార్ కార్డు తప్పనిసరి అన్నదే కొత్త విషయమని ఎక్సైజ్ సూపరిండెంట్, సిట్ చీఫ్ శ్రీ శ్రీనివాస్ రావు తెలిపారు. 21 ఏళ్లు దాటినవాళ్లు మాత్రమే పబ్‌లోకి ఎంటర్ కావాలి. ఏజ్ ప్రూఫ్ కోసం వారికి ఆధార్ ను తప్పనిసరి చేసింది ఎక్సైజ్ డిపార్ట్ మెంట్. నగరంలో ఉన్న 14 పబ్‌లకు ఇప్పటికే సిట్ వార్నింగ్ లేఖలను పంపింది.