జనవరి 26న వస్తున్న ఆచారి

208
Aachari America Yatra Release Date Locked
- Advertisement -

విష్ణు కథానాయకుడిగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ‘ఆచారి అమెరికా యాత్ర’ రూపొందుతోంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, చివరి దశకి చేరుకుంది. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. జనవరి 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు సరసన  ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బ్రహ్మానందం ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. గతంలో విష్ణు – నాగేశ్వర రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘దైనికైనా రెడీ’ .. ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

Aachari America Yatra Release Date Locked
ఇతర తారాగణం:కోట శ్రీనివాస్ రావు, పోసాని కృష్ణ మురళి, పృథ్వి, ప్రవీణ్, విద్యుల్లేఖ రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావత్, ఠాకూర్ అనూప్ సింగ్, సుప్రీత్, రాజా రవీంద్ర తదితరులు.సాంకేతిక వర్గం:రచయత: మల్లాది వెంకటకృష్ణ మూర్తి,ఛాయాగ్రాహకుడు: సిద్దార్థ్,ఎడిటింగ్: శేఖర్,సంగీతం: ఎస్.ఎస్. థమన్,మాటలు: డార్లింగ్ స్వామి ,ఆర్ట్ : కిరణ్ ,యాక్షన్ : సెల్వ ,బ్యానర్ : పద్మజ పిక్చర్స్ ,సమర్పించు : ఎం ఎల్ కుమార్ చౌదరి ,నిర్మాతలు: కీర్తి చౌదరి , కిట్టు ,స్క్రీన్ప్లే , దర్శకత్వం : జి నాగేశ్వర్ రెడ్డి

- Advertisement -