ఆ టాలెంటెడ్ హీరో ఆలోచించుకోవాలి!

15
- Advertisement -

హీరో నిఖిల్ మంచి నటుడే. కానీ, కార్తికేయ 2 పాన్ ఇండియా హిట్ అయినప్పటి నుంచీ.. నిఖిల్ తన నటన పై కంటే కూడా.. పాన్ ఇండియా సినిమా పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు టాక్ ఉంది. నిఖిల్ ఒక కథ గురించి మాట్లాడితే.. వెంటనే పాన్ ఇండియా కథ కావాలి అంటున్నాడట. దర్శకులు ఏ కథ చెప్పినా ‘పాన్ ఇండియా స్టోరీలు కావాలండి’ అనేది నిఖిల్ సమాధానం. అవును.. నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా పై దృష్టి పెట్టాడు. తన సినిమా అన్ని రాష్ట్రాల్లో ఆడాలని, తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలని నిఖిల్ కోరుకోవడంలో తప్పు లేదు.

కానీ.. పాన్ ఇండియా కంటెంట్ కోసం… లోకల్ గా వచ్చే మంచి కథలను నిఖిల్ వదిలి పెడితే ఎలా ?. నిఖిల్ మంచి నటుడు. ముఖ్యంగా వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే నిఖిల్.. తెలుగులోనూ సినిమాల వేగం పెంచాలి. నిఖిల్ తన మూలాల్ని మరిచిపోకుండా తెలుగు ప్రేక్షకుల కోసమైనా వరుసగా ఓన్లీ తెలుగు సినిమాలైనా చేయాలి. నిజానికి నిఖిల్ కి బాయ్ నెక్ట్స్ డోర్ అనే ఇమేజ్ ఉంది.

నిఖిల్ కి హిట్లు కూడా అందుకే వచ్చాయి. కార్తికేయ 2 హిట్ కి కూడా ముఖ్య కారణం నిఖిల్ అభిరుచే. సో… అలాంటి గొప్ప అభిరుచిని నిఖిల్ దూరం చేసుకోకుండా ఉంటే.. బాగుంటుంది. మరి నిఖిల్ కెరీర్ ఎటు వైపు వెళ్తుందో చూడాలి. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 3 సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు. ఈ లోపు లోకల్ గా నిఖిల్ ఎక్కువ సినిమాలు చేయాలని ఆశిద్దాం.

ఇవి కూడా చదవండి…

హిందీలో లవ్‌టూడే రీమేక్…

పిక్ టాక్ : ఒయ్యారం ఒలకబోస్తోన్న చాందిని

ఉగాదికి ఫస్ట్ లుక్ షురూ !

- Advertisement -