‘ఆ ఒక్కటి అడక్కు’ .. అప్‌డేట్

7
- Advertisement -

కామెడీ కింగ్ అల్లరి నరేష్, కొత్త దర్శకుడు మల్లి అంకం దర్శకత్వంలో, చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.

టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ ‘ఆ ఒక్కటి అడక్కు’ ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ వేసవిలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్ చేస్తారు.

ఇప్పటికే విడుదల టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం తగిన వినోదాన్ని అందిస్తుందని, ఇందులో లీడ్ పెయిర్ మహ్ద్య అందమైన ప్రేమకథ కూడా ఉంటుందని టీజర్ ప్రామిస్ చేస్తోంది.ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రాఫర్ కాగా, గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్.

Also Read:టీడీపీలో ‘ఉండి’ టికెట్ రచ్చ!

- Advertisement -