నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. సుధీర్ బాబుకు జోడిగా కృతిశెట్టి హీరోయిన్‌గా కనిపించగా బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురాగా ఈ సినిమాతో సుధీర్ బాబు ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం..
కథ:
నవీన్ (సుధీర్ బాబు) ఐదు బ్యాక్ టు బ్యాక్ విజయవంతమైన చిత్రాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్. తన తర్వాతి చిత్రం కోసం హీరోయిన్ కోసం వెతుకుతుండగా డాక్టర్ అలేఖ్య (కృతి శెట్టి) నుంచి ఓ వీడియో చూసి అమితంగా ఇంప్రెస్ అవుతాడు. దీంతో ఆమెను హీరోయిన్‌గా పెట్టి సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు? తర్వాత ఏం జరుగుతుంది..? అలేఖ్య కుటుంబాన్ని ఒప్పించి ఎలా సినిమా తీస్తాడు..చివరికి కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్. తన నటనతో సినిమాను మరో స్ధాయికి తీసుకెళ్లారు సుధీర్ బాబు. కృతి శెట్టి తన నటన, అందంతో సినిమాకు మరింత గ్లామర్ తెచ్చింది. సుధీర్ బాబుతో కృతి కెమిస్ట్రీ బాగుంది. మిగితా నటీనటులు తమ పరిథిమేరకు ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఫ్లాట్ కథనం, రచన, ఎక్కువగా సంగీతం (పాటలు).
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మినహా సాంకేతిక విభాగాలన్నీ తగిన పని చేశాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
సుధీర్ బాబు మరియు మోహన్ కృష్ణ ఇంద్రగంటి నుంచి మరో సెన్సిబుల్ రొమాంటిక్ డ్రామా అని చెప్పాలి. మెయిన్ లీడ్ సుధీర్, కృతి తమ నటనతో ఇంప్రెస్ చేయగా స్లోగా సాగే నరేషన్, కొన్ని రొటీన్ అనిపించే సీన్స్ మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.
విడుదల తేదీ : 16/09/ 2022
రేటింగ్ : 2.5/5
నటీనటులు: సుధీర్ బాబు, కృతి శెట్టి
నిర్మాతలు: మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి
సంగీతం: వివేక్ సాగర్
దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి