‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ బెస్ట్ మూవీ!

80
sudheer babu
- Advertisement -

నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ అవుతుంది. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి కనిపించనుంది. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌ పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నుండి ‘మీరే హీరో లాగ’ పాటని ప్రెస్, మీడియా సమక్షంలో గ్రాండ్ గా విడుదల చేశారు. దర్శకుడు హను రాఘపుడి సాంగ్ లాంచ్ ఈవెంట్ కి అతిధిగా పాల్గొన్నారు.

హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. సినిమాలని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడానికి జర్నలిస్ట్ లు చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు. ఒక మంచి సినిమా వస్తే మాకంటే మీరే ఎక్కువ ప్రమోట్ చేస్తారు.నటీనటులకు ఎంత ప్యాషన్ వుంటుందో జర్నలిస్ట్ లు కూడా అంతే ప్యాషన్ తో పని చేస్తారు. మీరే హీరోలా వున్నారు పాట ప్రెస్ సమక్షంలో విడుదల చేయడం ఆనందంగా వుంది. ఈ పాట ప్రెస్, మీడియాకి డెడికేట్ చేస్తున్నాం. ఇంద్రగంటి గారు కథకు న్యాయం చేసే దర్శకుడు . ఆయనతో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. కృతి ఇందులో అద్భుతమైన పాత్ర చేసింది. ఉప్పెన వల్ల ఆమెకు పది సినిమాలు వస్తే ఈ సినిమాతో కృతి టాలీవుడ్ లో స్థిరపడిపోతుంది. ఎలాంటి పాత్ర అయినా చేయగలననే నమ్మకం ఇస్తుందని భావిస్తున్నా. పీజీ విందా గారితో ఇది నా నాలుగో సినిమా. వివేక్ సాగర్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాతలు మహేంద్ర బాబు, సుధీర్ బాబు, కిరణ్ కి ఇది పర్ఫెక్ట్ లాంచ్. సినిమా చాలా రిచ్ గా వుంటుంది. మహేష్ బాబు సినిమా ఎంత రిచ్ గా వుంటుందో ఈ సినిమాలో కూడా అంతే రిచ్ నెస్ వుంటుంది. నాకు సిరివెన్నెల గారి పాటలు అంటే ఇష్టం. ఆయన్ని మనం మిస్ కాకూడదు. అలా మిస్ కాకుండా చూసుకునే బాధ్యత రామజోగయ్య శాస్త్రీ గారి పై వుంది. హను రాఘపుడి గారు నాకు ఇష్టమైన దర్శకుడు. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. సెప్టెంబర్ 16 న విడుదలౌతుంది. ఇంద్రగంటి గారి బెస్ట్ మూవీ ఇది. ప్రేమకథతో పాటు అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా వుంటుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది” అన్నారు

దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. నేను కూడా జర్నలిస్ట్ గా పని చేశాను. చాలా ఇంటర్వ్యూ లు చేశాను. ఒక ఇంటర్వ్యూ తరహాలో హీరో ఇంట్రో సాంగ్ వుంటే ఎలా వుంటుందనే ఆలోచనని రామజోగయ్య శాస్త్రి గారికి చెప్పాను. ఆయన వెంటనే నన్ను పాతిక ప్రశ్నలు అడిగారు. చిన్న ఎత్తిపొడుపు, చమత్కారం, చిన్న సంఘర్షణ .. ఇలా చాలా ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఈ పాట కంపోజిషన్ ఒక సవాల్ తో కూడుకున్నది. సంభాషణని సంగీతంలో ఇమడ్చడం కష్టమైన పక్రియ. వివేక్ వండర్ ఫుల్ గా కంపోజ్ చేశారు. దినేష్ దీనికి అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు. మీరే హీరోలాగ పాట క్రెడిట్ రామజోగయ్య శాస్త్రి, దినేష్, వివేక్ కి దక్కుతుంది. సుధీర్ నా ఫేవరేట్ నటుడు. ఇందులో కూడా అద్భుతమైన ఫెర్ఫార్ మెన్స్ వుంటుంది. కృతిని ఉప్పెన కంటే ముందే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో చాలా కొత్త కృతి కనిపిస్తుంది. నిర్మాతలకు మంచి అభిరుచి వుంది. ఈ సినిమాని సపోర్ట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, రవి గారికి కృతజ్ఞతలు. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ అద్భుతంగా వర్క్ చేశారు. ఇది నా మోస్ట్ ఎమోషనల్ ఫిల్మ్. అలాగే ఈ పాట కూడా మోస్ట్ ఫేవరేట్ సాంగ్. మంచి కంటెంట్ వుంటే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారని దర్శకుడు హనురాఘపుడి నిరూపించారు. ఆయనకి అభినందనలు. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. ఈ పాట నా ప్రెస్, మీడియా ఫ్రెండ్స్ కి అంకితం చేస్తున్నా. మీ సమక్షంలో పాటని విడుదల చేయడం ఆనందంగా వుంది. సెప్టెంబర్ 16 న సినిమా వస్తోంది. ప్రేక్షకులంతా థియేటర్ కి వచ్చి మంచి విజయం ఇస్తారని, మంచి సినిమాలు తీసే నిర్మాతలని ప్రొత్సహిస్తారని కోరుతున్నా” అన్నారు

దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. ఇంద్రగంటి మోహన కృష్ణ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన తీసిన గ్రహణం నాకు చాలా ఇష్టం. నాపై చాలా ప్రభావాన్ని చూపిన సినిమా అది. ఆయన సినిమాలన్నీ సహజంగా వుంటాయి. సమ్మోహనం నాకు చాలా ఇష్టం. సుధీర్ బాబు గారు ప్రతి సారి కొత్తగా కనిపిస్తారు. నిజంగా చాలా మందికి ఆయన స్ఫూర్తి. కృతి శెట్టి ఉప్పెనలో అద్భుతంగా చేశారు. నిర్మాతలు, టీం అందరికీ ఆల్ ది బెస్ట్” తెలిపారు.

కృతి శెట్టి మాట్లాడుతూ.. ఇది మీడియా, హీరో గారి మధ్యలో వున్న ప్రత్యేకమైన పాట. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు సరిగ్గా రీచ్ కావాలంటే మీడియా, పీఆర్వో ల పాత్ర కీలకం. మీడియాకి, మా పీఆర్వో వంశీ శేఖర్, తేజు గారికి థాంక్స్. బెంచ్ మార్క్ లో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. సుధీర్ గారు ఇందులో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. సుధీర్ గారితో నటించడం ఆనందంగా వుంది. నటనకు ఆస్కారం వుండే మంచి పాత్రని ఇచ్చిన ఇంద్రగంటి గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం కోసం పని చేసిన యూనిట్ అంతటికి థాంక్స్’ తెలిపారు

సమర్పకులు గాజులపల్లె సుధీర్ బాబు మాట్లాడుతూ.. సాంగ్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన హను రాఘవపూడి గారికి థాంక్స్. మూడు రోజుల క్రితమే సినిమా చూశాం సినిమా. అద్భుతంగా వచ్చింది.ఖచ్చితంగా హిట్ కొడతాం. ఇంద్రగంటి గారు మాకు అవకాశం ఇవ్వడమే మా అదృష్టం. సుధీర్ బాబు, కృతి శెట్టి అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేశారు. సినిమా యూనిట్ అందరికీ కృతజ్ఞతలు” తెలిపారు.

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. సుధీర్ బాబు గారి సమ్మోహనం తర్వాత ఆయనతో కలసి పని చేయడం చాలా సంతోషం.

ఇంద్రగంటి గారి సినిమా అంటే కథాబలం వుంటుంది. కృతిశెట్టికి ఇది చాలెంజింగ్ రోల్. ఇంద్రగంటి క్రియేటివ్ డైరెక్టర్. ఆయనతో పని చేస్తే మనలో కొన్ని కొత్త కోణాలు బయటికి వస్తాయి. ఆయన దర్శకత్వంలో మ్యాజిక్ వుంటుంది. ఈ పాట రెండు ఫోన్ కాల్స్ మధ్యలో వున్న గ్యాప్ లో రాశాను. ఇందులో మొత్తం మూడు పాటలు రాశాను. అన్నీ గర్వంగా చెప్పుకునే పాటలు. సెప్టెంబర్ 16 న సినిమా వస్తోంది. సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది.

సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మాట్లాడుతూ.. ఇంద్రగంటి గారితో మరోసారి పని చేయడం చాలా ఆనందంగా వుంది. బెంచ్ మార్క్ బ్యానర్ కి ఆల్ ది బెస్ట్. . సెప్టెంబర్ 16 న సినిమా వస్తోంది. మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు

డీవోపీ పీజీ విందా మాట్లాడుతూ.. సుధీర్ బాబు ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తారు. ఈ అమ్మాయి సినిమాలో కొత్తగా కనిపిస్తుంది. కృతి అద్భుతమైన క్యారెక్టర్ చేసింది. ఇంద్రగంటి గారు చాలా మంచి సినిమా తీశారు. యూనిట్ మొత్తానికి థాంక్స్” చెప్పారు.

ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ మాట్లాడుతూ.. గత వారం విడుదలైన కార్తికేయ 2కి ఎలాంటి ఈ బ్లెస్సింగ్స్ వచ్చాయో ఈ సినిమాకి కూడా అలానే వస్తాయిని అనుకుంటున్నాను. సుధీర్ బాబు గారు, దర్శకుడు ఇంద్రగంటి గారు, నిర్మాతలు బి మహేంద్ర బాబు, కిరణ్ గారికి కలసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది” అన్నారు

ఈ చిత్రానికి పిజి విందా సినిమాటోగ్రఫర్ గా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తారాగణం: సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు.

సాంకేతిక విభాగం

రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి

నిర్మాతలు: బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి

సమర్పణ: గాజులపల్లె సుధీర్ బాబు

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్

సంగీతం: వివేక్ సాగర్

డీవోపీ: పీజీ విందా

ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

లిరిక్స్: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్

కో-డైరెక్టర్: కోట సురేష్ కుమార్

పీఆర్వో : వంశీ శేఖర్

- Advertisement -