ఆ యాంకర్లిద్దరికీ నేడు చేదు జ్ఞాపకం

32
- Advertisement -

తెలుగు బుల్లితెర పై తమ పలుకులతో పాటు తమ అందచందాలతో ప్రేక్షకులను అలరించిన మోడ్రన్ అందగత్తెలు యాంకర్ రష్మీ గౌతమ్ – యాంకర్ విష్ణుప్రియ. ఈ ఇద్దరి యాంకర్లకు ఈ రోజు పెద్ద చేదు జ్ఞాపకంలా మిగిలిపోనుంది. ఈ ఉదయం వీరిద్దరి జీవితాల్లో చెడు జరిగింది. ముందుగా యాంకర్ రష్మీ గౌతమ్ విషయానికి వస్తే.. ఆమె ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రష్మీ గ్రాండ్‌ మదర్ ప్రమీలా మిశ్రా మృతి చెందారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది రష్మీ. “ప్రమీలా మిశ్రా ఎంతో స్ట్రాంగ్ వుమన్. మాపై ఆమె ప్రభావం ఎంతో ఉంది. ఆమె దూరమైనా.. ఆమె జ్ఞాపకాలు ఎల్లప్పుడు మాతో ఉంటాయి. ఓం శాంతి’’ అంటూ పోస్ట్ చేస్తూ తన అమ్మమ్మ పై అభిమానాన్ని చాటుకుంది రష్మీ .

ఇక రెండో యాంకర్ విష్ణుప్రియ విషయానికి వస్తే… ఫేమస్ సోషల్ మీడియా యాప్ ఫేస్‌ బుక్‌‌ లో ఈ తెలుగు యాంకర్ న్యూడ్ వీడియోలు మరోసారి వైరల్‌గా మారాయి. విష్ణుప్రియ న్యూడ్ వీడియోలు అనేసరికి నెటిజన్లు ఎగబడ్డారు. తాజాగా ఈ వీడియోస్ పై స్పందించిన విష్ణుప్రియ తన అకౌంట్‌ హ్యాక్‌ ‌అయిందని, ఆ వీడియోస్ ఫేక్ అని ఆమె వివరణ ఇచ్చింది. ఈ విషయం పై చాలామంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ కాల్ చేసి తనను అడుగుతున్నారని, ఐతే భయపడాల్సిన పనేం లేదని ఆమె తెలిపింది. అలాగే విష్ణు ప్రియ ఇంకా మాట్లాడుతూ.. అసలు తన ఖాతానే ఎందుకు హ్యాక్‌ చేస్తున్నారో తెలీట్లేదంటూ విష్ణుప్రియ వాపోయింది.

ఇవి కూడా చదవండి…

‘పుష్ప 2’ నేపథ్యం అదే !

వారసుడు ఓటీటీలోకి ఎప్పుడంటే…

తన ప్రేమ పుకార్ల పై రష్మిక స్పందన

- Advertisement -