టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న 25వ చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్
. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపు పొందిన ఈ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ హీరో సందీప్ కిషన్‌కి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.
డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టర్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషెక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మిస్తున్నారు.
ఏ1 ఎక్స్‌ప్రెస్
ట్రైలర్‌ను ఈరోజు విడుదలచేసింది చిత్ర యూనిట్ ఈ ట్రైలర్‌లో.. భారతదేశం తరఫున ఆడాలని కలలు కనే యువ హాకీ ఆటగాడిగా సందీప్ కిషన్ కనిపిస్తున్నారు. అతడి ప్రేమికురాలిగా లావణ్య త్రిపాఠి కూడా హాకీ ప్లేయర్ కావడం విశేషం. ఆన్ స్క్రీన్ మీద ఈ జంట చూడముచ్చటగా ఉంది.
ట్రైలర్‌లో తన హాకీ స్కిల్స్‌తో సందీప్ కిషన్ అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. ఈ సినిమా కోసం బరువు తగ్గి సిక్స్ ప్యాక్ బాడీని సాధించాడు. పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ఉన్న ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది. హిప్ హాప్ తమిళ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ని మంచి ఎలివేషన్ ఇచ్చింది. కెవిన్ రాజ్ విజువల్స్ ఫ్రెష్‌గా ఉండడంతో పాటు ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 26న విడుదలచేస్తున్నట్లు తెలిపారు మేకర్స్.