ప్రభాస్‌ పెళ్ళిపై .. స్టార్‌ హీరో కామెంట్‌..

259
a star hero comment on prabhas marriage
- Advertisement -

టాలీవుడ్‌ మోస్ట్ బ్యాచులర్‌ హీరో ప్రభాస్‌ పెళ్ళెప్పుడంటూ ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. ఆ క్రమంలోనే అనుష్కతో ప్రభాస్‌ ఎఫైర్‌ నడిపిస్తున్నాడని త్వరలోనే స్వీటిని పెళ్ళి చేసుకోబోతున్నాడని గట్టిగానే రూమర్లు వినిపించాయి. ఇక ఆ రూమర్లకు ప్రభాస్‌, అనుష్కలు క్లారిటీ ఇవ్వడంతో .. ఆ వార్తలకు పుల్‌ స్టాప్‌ పడింది.

 a star hero comment on prabhas marriage

అయితే తాజాగా మరో స్టార్‌హీరో ప్రభాస్‌ పెళ్ళిపై కామెంట్ చేశాడు. ఆ స్టార్‌ హీరోనే గోపీచంద్‌. తన చిరకాల మిత్రుడైన ప్రభాస్…ఇంతకాలమూ ‘బాహుబలి’తో బిజీగా ఉన్నందునే పెళ్లి విషయాన్ని ప్రభాస్ పక్కన బెట్టాడని, ఇప్పుడు కాస్త రిలాక్స్ గా ఉన్నాడు కాబట్టి త్వరలోనే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడని చెప్పాడు.

ప్రస్తుతం తాను నటించిన ‘ఆక్సిజన్’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో మీడియాతో మాట్లాడిన గోపీచంద్‌ ఈ విషయాన్ని చెప్పాడు. ఇక ‘ఆక్సిజన్’ చిత్రం వెనుక ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఉన్నారని నమ్మి చేశానని, ఈ సినిమా తనలో ఆక్సిజన్ ను నింపుతుందని భావిస్తున్నానని చెప్పాడు గోపీచంద్‌.

- Advertisement -