ఈ సినిమా చూసేవారేవరు..!

190
A M B I A N C É - a 720 hours long film by Anders Weberg
A M B I A N C É - a 720 hours long film by Anders Weberg
- Advertisement -

సాధారణంగా సినిమా రెండున్నర గంటలకు మించితే.. చాలా స్టోరీ ఉందనుకుంటాం.. మహా బోర్‌గా కూడా ఫీలవుతాం.. అయితే అందుకు భిన్నంగా సుమారు 30 రోజులపాటు చూసే– అంటే 720 గంటల నిడివి గల సినిమా రాబోతుందంటే ఎలా ఉంటుందో ఆలోచించండి.. అలాంటి ప్రయత్నమే జరిగింది.. స్వీడన్‌ కు చెందిన ప్రముఖ దర్శకుడు ఆండర్స్‌ వెబెర్గ్‌ రూపొందిస్తున్న ఈ మూవీ ఇప్పటివరకు ఏ సినిమా సాధించని సరికొత్త రికార్డ్ సాధించబోతోంది. ఈ సినిమా పేరు యాంబియన్స్. 2020 నాటికి సినిమా ప్రపంచం నుంచి తప్పుకోవాలని భావిస్తున్న దర్శకుడు వెబెర్గ్‌.. ప్రపంచంలో అత్యంత ఎక్కువ నిడివిగల సినిమాను రూపొందించాలని నిర్ణయించాడు. దీంతో 30 రోజుల సుదీర్ఘ సినిమాకు శ్రీకారం చుట్టాడు.తనకు బాగా పరిచయమున్న విజువల్‌ ఎఫెక్ట్స్ తో పాటు ఇతర సినీ విభాగాల్లో ఏదైనా సరికొత్త ప్రయోగం చేయాలని భావించాడు.

స్టోరీ, డైలాగ్స్ లేని ఈ సినిమా నాలుగేళ్ల క్రితమే ప్రారంభమై ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది.. ఈ మహా మెగా మూవీలో వంద మంది నటించారు. కేవలం నటీనటులతో పాటు దృశ్యాల్ని మాత్రమే చిత్రీకరించి, వాటికి ఎక్కువగా విజువల్‌ ఎఫెక్ట్స్ జోడించి రూపొందించడమే ఈ సినిమా ప్రత్యేకత. 2014లో విడుదల చేసిన తొలి ట్రైలర్ నిడివి ఏడు నిమిషాలు కాగా, గతేడాది రిలీజ్ చేసిన రెండో ట్రైలర్ లెన్త్ ఏడు గంటలు. కేవలం ట్రైలరే రెండు పెద్ద సినిమాలంత నిడివితో ఉంది. వచ్చే ఏడాది చివర్లో 72 గంటలుండే మూడో ట్రైలర్ ను రిలీజ్ చేస్తారట. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు విడుదల చేసి, ఒకేసారి స్క్రీన్ చేయబోతున్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే యాంబియన్స్ సినిమా కాపీలు మరెవరికీ దొరక్కుండా చేస్తాడట డైరెక్టర్ యాండర్స్ వెబెర్గ్. 30 రోజుల ప్రదర్శన పూర్తయిన అనంతరం ఈ సినిమా కాపీని కాల్చేస్తారట. 720 గంటలపాటు నడిచే యాంబియన్స్ సినిమా 2020లో విడుదలవుతుంది. మరీ స్టోరీ, డైలాగుల్లేని ఈ సినిమా చూసే వారేవరో చూడాలి..

- Advertisement -