కళామతల్లి ముద్దుబిడ్డ.. ఎప్పటికీ మరువము !

260
A Huge Loss,says Telugu Industry
A Huge Loss,says Telugu Industry
- Advertisement -

దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి పట్ల సినీన‌టులు చిరంజీవి, బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. ప్రస్తుతం చైనాలో ఉన్న చిరంజీవి అక్కడి నుంచే సంతాప ప్రకటనను విడుదల చేస్తూ… ఇటీవ‌లే దాసరికి తాము అల్లు రామలింగయ్య అవార్డును అందించామ‌ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను దాసరితో చాలాసేపు మాట్లాడానని చెప్పారు. తెలుగు సినిమాకు దాస‌రి కొత్త‌దారి చూపించార‌ని బాల‌కృష్ణ అన్నారు. కళామతల్లి ముద్దుబిడ్డ దాసరిని చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మరువదని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. దాసరి మృతి పట్ల తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

*ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రరావు: ప‌రిశ్ర‌మ‌కు అమావాస్య లాంటి రోజు. దాస‌రి లేర‌న్న విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాం.
* ఎన్టీఆర్‌: ‘తెలుగు చిత్ర కళామ్మతల్లి కన్న ఒక దిగ్గజం ఇక లేదు. మరువదు ఈ పరిశ్రమ మీ సేవలను. దాసరి నారాయణ రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’
* పూరీ జగన్నాథ్‌: ‘శకం ముగిసింది. కానీ లెజెండ్స్‌ ఎప్పటికీ సజీవంగానే ఉంటారు’
* హరీశ్‌ శంకర్‌: ‘రచయిత, దర్శకుడు, నిర్మాత, నటుడు, సంపాదకుడు బహుముఖ ప్రతిభాశాలి దాసరి గారి అస్తమయం. తెలుగు వారికి తీరని లోటు’
* రఘు కుంచె: ‘మహా దర్శకులు మనకు ఇక లేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’
* రకుల్‌ప్రీత్‌ సింగ్‌: ‘దాసరి నారాయణ రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి. మీరెప్పుడూ మాకు జ్ఞాపకం ఉంటారు’
* అల్లరి నరేశ్‌: ‘మన చిత్ర పరిశ్రమ.. దారి చూపే వెలుగును కోల్పోయింది. దాసరి నారాయణ రావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’
* రాజ్‌ తరుణ్‌: ‘దాసరి నారాయణ రావు గారు గొప్ప వ్యక్తి. ఇది చిత్ర పరిశ్రమకు, ఆయన కుటుంబానికి తీరని లోటు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా’
* రామజోగయ్య శాస్త్రి: ‘దాసరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’
* మారుతి: ‘హృదయ విదారకమైన వార్త, మనకు తీరని లోటు. దాసరి గారి ఆత్మకు శాంతి చేకూరాలి. మా తరానికి మీరు స్ఫూర్తిదాయకం. మా హృదయాల్లో మీరెప్పుడూ నిలిచి ఉంటారు’
* వరుణ్‌ తేజ్‌: ‘మీ ఆత్మకు శాంతి చేకూరాలని దాసరి గారు. మీ గొప్ప పనితీరు మిమల్ని ఎప్పుడూ గుర్తుంచుకునేలా చేస్తుంది’
* నాని: ‘లెజెండ్‌ను కోల్పోయాం. ఆయన తన క్లాసిక్స్‌ ద్వారా ఎప్పుడూ మనతోనే ఉంటారు’
* సునీల్‌: ‘దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’.

- Advertisement -