వేములవాడ రాజన్నకు వింత మొక్కు..

241
Women Pray for Dog At Vemulawada Temple
- Advertisement -

వేములవాడ రాజన్నను ఓ మహిళ వింత మొక్కు మొక్కింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీలత దంపతులకు పిల్లలు లేకపోవడంతో గత కొంత కాలం నుంచి 2 కుక్కపిల్లలను పెంచుకుంటున్నారు. వాటినే తమ పిల్లలుగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆరెండు కుక్కలను తమ కడుపున పుట్టిన బిడ్డలలానే పెంచుతున్నారు. అంతేకాకుండా వారు తినే ఆహారాన్నే కుక్కలను పెడుతున్నారు.

ఆ రెండు కుక్కలలో ఇటివలే ఓ కుక్కకు ఆరోగ్యం బాలేకపోవడంతో శ్రీవేములవాడ రాజరాజేశ్వర స్వామికి మొక్కింది శ్రీలత. కుక్క ఆరోగ్యం బాగుపడితే నీ పేరు శివ అని పెట్టి నిలువెత్తు బంగారం సమర్పిస్తానని మొక్కింది శ్రీలత. దీంతో తాజాగా కుక్క ఆరోగ్యం కుదుటపడటంతో శ్రీ వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చి కుక్క ఎత్తు బంగారాన్ని స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంది. అన్ని ఉన్నా కూడా పిల్లలను సరిగ్గా చూసుకోలేని ఈరోజుల్లో కుక్కలను పెంచుకుంటూ వాటినే తమ పిల్లల్లా చూసుకుంటున్నా శ్రీలత దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు.

- Advertisement -