టార్చర్ పెడుతున్న నాని హీరోయిన్

209
A Busy Year Ahead For Mehreen
- Advertisement -

కృష్ణగాడి ప్రేమ కథ సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశించిన బ్యూటీమెహరీన్ కౌర్. ఈ సినిమా విజయం అందించిన జోష్‌తో దూసుకుపోతోంది మెహరీన్. వరుస ఆఫర్లతో సినీయర్‌ హీరోయిన్లకే సవాల్ విసురుతోంది. హీరోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే తెలుగు సినీ పరిశ్రమలో ఏకంగా   చేతిలో అయిదు సినిమాలతో ఈ పంజాబీ ముద్దుగుమ్మ  దూసుకుపోతోంది.

రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న రాజ ది గ్రేట్ సినిమాలో మెహరీన్ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ ముమ్మరంగా సాగుతోంది. సాయిధరమ్‌ తేజ్‌తో  ‘జవాన్‌’ , శర్వానంద్ హీరోగా రానున్న కొత్త మూవీలో మెహరీన్ నటించే ఛాన్స్ కొట్టేసింది. వీటితో పాటు మరో మూడు తెలుగు సినిమాల్లో కూడా మెహరీన్ నటించేందుకు ఛాన్స్ దక్కించుకున్నట్లు సమచారం.

 A Busy Year Ahead For Mehreen
ఎన్టీఆర్ బాబీ లేటెస్ట్ మూవీకి కూడా మెహరీన్  హీరోయిన్ గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు బాలీవుడ్ లో అనుష్క శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫిల్లౌరీ’ లో సెకెండ్ హీరోయిన్ గా మెహరీన్ నటిస్తోంది. ఇంత వేగంగా ఈమె క్రేజ్ ఇలా పెరిగి పోవడానికి ఈమె తక్కువ పారితోషికానికి రావడమే అని అంటున్నారు. మొత్తానికి మోడలింగ్ నుంచి టాలివుడ్ లోకి ఎంటరయిన మెహరీన్ ఈ యేడాది వరుస సినిమాలతో ఆదరగొట్టడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో  హీరోయిన్స్ అడుగుతున్న పారితోషికాలు కోరుతున్న కోరికలు చూసి మెహరీన్ వైపు మొగ్గుచూపుతున్నారట నిర్మాతలు. దీంతో టాప్ హీరోయిన్స్‌కి రానున్న కాలంలో గడ్డు పరిస్ధితులు తప్పవని సినిమా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -