బ్యూటిఫుల్ హీరోయిన్ ఛార్మి తో మంత్ర, అనుపమ పరమేశ్వరన్ తో బటర్ ఫ్లై చిత్రాలు తీసి ఎంతో మంచిపేరు తెచ్చుకున్న జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్ పై నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ నటీ నటులుగా, రవి ప్రకాష్ బోడపాటి రచన-దర్శకత్వంలో, ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు లు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం ”ఎ బ్యూటిఫుల్ గర్ల్ “.ఈ చిత్రానికి సహ నిర్మాతలు గా అనిల్, క్రాంతి జువ్వల, ఎక్సగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా మోహన్ దాస్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 21 న గ్రాండ్ గా విడుదలకు సిద్దమైన సందర్బంగా
చిత్ర నిర్మాత ప్రసాద్ తిరువల్లూరి మాట్లాడుతూ..2007లో మంత్ర వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన రచయిత, నిర్మాత రవిప్రకాష్ బోడపాటి స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇలా అన్నీ తనే రాసుకున్న ఈ కథ నచ్చడంతో ఈ సినిమా చేశాము. రామ్ నటించిన జగడం మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రామ్ కు తమ్ముడుగా నటించిన నిహాల్ ఇందులో హీరోగా, అరుంధతి సినిమాకు క్యాస్టూమ్ డిజైనర్ గా వర్క్ చేసి నంది అవార్డ్స్ అందుకొన్న దీపాచందర్ కూతురు ద్రిషిక చందర్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశాము.తను చేసిన “మనసా నమః” షార్ట్ ఫిల్మ్ కు 400 పైన అవార్డ్స్ వచ్చాయి.ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 21 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము అన్నారు.
చిత్ర రచయిత, దర్శకుడు రవి ప్రకాష్ బోడపాటి మాట్లాడుతూ.. ఎ బ్యూటిఫుల్ గర్ల్ సినిమా తప్పకుండా మనసుని గట్టిగా హత్తుకుని చాలా రోజులు మీతో ఉంటుంది, సినిమా ఫస్ట్ కాపీ చూస్కుంటే సంతోషంగానే కాదు చాలా గర్వంగా గా కూడా అన్పించింది అని చెప్పారు.మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకి సంగీత దర్శకుడు అర్వీజ్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు. ఇందులో ఉన్న ఐదు డిఫరెంట్ సాంగ్స్ అందరికి బాగా కనెక్ట్ అవుతాయి. గిడియన్ కట్టా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెలుతుంది.ఇందులో వర్క్ చేసిన నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 21 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నహాలు జరుగుతున్నాయి అన్నారు.
నటీ నటులు
నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ తదితరులు
సాంకేతిక నిపుణులు
నిర్మాతలు : ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు
సహ నిర్మాతలు : అనిల్, క్రాంతి జువ్వల
ఎక్సగ్యూటివ్ ప్రొడ్యూసర్ : మోహన్ దాస్ సా
స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : రవి ప్రకాష్ బోడపాటి
డి. ఓ. పి : అమర్ దీప్
ఆర్ట్ : విజయ్ మక్కెన
మ్యూజిక్ డైరెక్టర్ : అర్వీజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : గిడియన్ కట్ట
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
కాస్ట్యూమ్స్ డిజైనర్: హర్షిత రావూరి
పి. ఆర్. ఓ : హరీష్, దినేష్