- Advertisement -
రాష్ట్రపతి భవన్ లో మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 5వ సమావేశం ప్రారంభమయ్యింది. ఈ సమావేశానికి నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, సీఈవో, సభ్యులు, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా కరవు పరిస్థితి, ఉపశమన చర్యలు, సాగు విధానంలో మార్పులు, వర్షపు నీటి సంరక్షణ, తీవ్రవాద ప్రాంతాలు, మావోయిస్టుల సమస్య, భద్రత అంశాలపై చర్చించనున్నారు.
సమావేశంలో మాట్లాడేందుకు ప్రతి ముఖ్యమంత్రికి ఐదు నిమిషాల సమయం కేటాయించారు. తొలిసారిగా ఈసమావేశంలో పాల్గోన్నారు తొలిసారి సమావేశంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఆహారం పౌర సరఫరాల శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ, జల్ శక్తి శాఖ మంత్రులు.
- Advertisement -