మహర్షి సినిమా తర్వాత హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు మహేష్ బాబు. జర్మనీ,ఇటలీ దేశాల టూర్‌ని పూర్తిచేసుకున్న మహేష్ ఫ్యామిలీ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్నారు. ప్రపంచకప్ సందర్భంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌ని ఫ్యామిలీతో కలిసి వీక్షించిన మహేష్..తాజాగా పాకిస్థాన్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌ను కూడా చూడబోతున్నట్లు తెలుస్తోంది. భారత ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాది పోరును చూసిన తర్వాత మహేష్ భారత్ తిరిగిరానున్నట్లు సమాచారం.
అయితే ఆదివారం జరిగే మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉందని అక్కడి వాతావరణ పరిస్థితిని బట్టి అర్థం అవుతోంది. ఇప్పటికే వర్షం విషయంలో అభిమానులు ఐసీసీపై కుళ్లు జోకులు పేల్చుతున్నారు. 11వ జట్టుగా పాల్గొన్న వర్షం సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుందని, ఆటగాళ్లు క్రికెట్ ఆడకుండా స్విమ్మింగ్ చేస్తున్నారనే సెటైర్లతో ట్రోల్ చేస్తున్నారు.
మరోవైపు భారత్-పాక్ మ్యాచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్. భారత బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. కానీ పాకిస్థాన్ వారితో సరితూగగలదు అని అభిప్రాయపడ్డాడు. ఒత్తిడిని అధిగమించే జట్టే ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తుందని తెలిపాడు. భారత్‌తో ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ బోణీ కొట్టని పాక్.. ఈ మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేస్తుందని అక్రమ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.