బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్,ఏపీలో టీడీపీ ముఖ్యనేతలు,ఎంపీలే టార్గెట్గా పావులు కదుపుతున్నారు బీజేపీ నేతలు రాంమాధవ్. ఈ నేపథ్యంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు ఆరుగురిని కమలం గూటికి చేరేలా కమలం నేతలు ప్లాన్ చేస్తున్నారని ఢిల్లీ రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ మైనారిటీలో ఉంది. టీడీపీ సభ్యులు ఆరుగురిని బీజేపీలో చేర్చుకోవడం ద్వారా రాజ్యసభలో బలాన్ని పెంచుకోవాలని కాషాయ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా సుజనాచౌదరి, సీఎం రమేశ్, గరికపాటి మోహన్రావు, తోటసీతారామలక్ష్మి, టీజీ వెంకటేశ్, కనకమేడలతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం నడుస్తోంది.
వీరిలో కొందరితో ఇప్పటికే పరోక్షంగా మంతనాలు ప్రారంభించినట్లు సమాచారం. వీరితో టీడీపీ నుంచి గెలిచిన లోక్ సభ ఎంపీలకు కూడా గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదేగనుక జరిగితే ఏపీలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది.