గట్టు భీముడు కన్నుమూత…సీఎం కేసీఆర్ సంతాపం

396
cm kcr
- Advertisement -

గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మధుమేహం, హైపర్‌ టెన్షన్‌తో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్దిరోజుల క్రితం నిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. 1999లో భీముడు  టీడీపీ నుంచి గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు.మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం టీఆర్ఎస్‌ నాయకుడిగా కొనసాగుతున్నారు.

- Advertisement -