తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..

346
Governor ESL Narasimhan
- Advertisement -

తెలుగు రాష్ట్రాలకు త్వరలో ఇద్దరు కొత్త గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై చర్చించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలపాటు సుధీర్ఘంగా భేటీ జరిగింది.

కాగా, రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచి తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ, ఏపీ కార్యక్రమాలకు హాజరయ్యే క్రమంలో ఆయన హైదరాబాద్, అమరావతి మధ్య నిత్య సంచారి అయ్యారు. ఇకపై ఆయనకు ఆ శ్రమ ఉండకపోవచ్చు! త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించాలని కేంద్రం ఆలోచిస్తోంది.

Governor ESL Narasimhan

 

అయితే ఓ తెలుగు రాష్ట్రానికి గవర్నర్‌గా నరసింహనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఏపీనా, తెలంగాణనా అనేదానిపై స్పష్టతలేదు. అమిత్ షాతో భేటీ అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ… హోంమంత్రి అమిత్‌ షాను మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని, స్నేహపూర్వకంగా ఉంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఏపీకి చెందిన ఉపయోగంలో లేని భవనాలను తెలంగాణ రాష్ట్రానికి పంపిణీ చేశామన్నారు. ఏపీ భవన్‌ సహా విభజన సమస్యలను ఒక‍్కొక‍్కటిగా పరిష్కరిస్తామని గవర్నర్‌ తెలిపారు.

- Advertisement -