ప్రముఖ సినీ నటుడు, రచయిత, దర్శకుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరు నివాసంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.
1938లో మహారాష్ట్రలోని మథేరన్‌లో జన్మించిన ఆయన కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. రచయితగా అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ,పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది.
సినీ పరిశ్రమలో నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు భారత అత్యున్నత పురస్కారాలైన పద్మ శ్రీ, పద్మ భూషణ్‌లు ఆయనను వరించాయి. ఇక రచయితగా 1998లో ఙ్ఞాన్‌పీఠ్ అవార్డును గిరీష్ దక్కించుకున్నారు. తెలుగులో ఆనంద భైరవి, ధర్మచక్రం, ప్రేమికుడు, రక్షకుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి చిత్రాల్లో నటించారు.గిరీష్ చివరిగా నటించిన చిత్రం ‘అప్నా దేశ్’. కన్నడలో తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కాబోతోంది.