ఎమ్మెల్యేలను కొన్నా.. అమ్మినా.. కాంగ్రెస్ కే చెల్లుతుంది

278
TRS leaders
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కలిసి శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తూ గురువారం స్పీకర్‌కు తీర్మాన పత్రాన్ని అందించారు.2/3 మెజార్టీ ప్రకారమే రాజ్యాంగబద్ధంగానే పత్రాన్ని అందజేశారు.గురువారం నుంచి ఈ 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గుర్తించబడతారని స్పీకర్‌ ద్రువీకరించారు. అయితే ఈ విలీనంపై పలువురు కాంగ్రెస్‌ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై టీఆర్‌ఎస్‌ కారదర్శి గట్టు రామచంద్రరావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్ రెడ్డిలు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

మీడియా సమావేశంలో టీఆర్‌ఎస్‌ కారదర్శి గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ.. మతిభ్రమించిన కొద్ది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని రోడ్లపై నిరసన తెలుపుతున్నారు.ఎమ్మెల్యేల కొనుగోలు చేయడంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో కాంగ్రెస్ పార్టీని మించింది లేదు.ఆయారాం గయారాం గా పేరుగాంచిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అయన అన్నారు.

TRS leaders

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకున్నప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ కాలేదా ?మీరు అప్పుడు నిరసన ఎందుకు తెలియజేయలేదు. ఎమ్మెల్యేలను కొన్నా అమ్మినా అది కాంగ్రెస్ కే చెల్లుతుంది. టిఆర్ఎస్ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి రాములు నాయక్ భూపతి రెడ్డి అలాగే టిడిపి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని ఎంతకు కొనుగోలు చేశారో కాంగ్రెస్ నేతలు చెప్పాలి.

తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వైపు గుంజుకున్న ప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా.అసలు కాంగ్రెస్ నేతలు మీది ఏ పార్టీ యో చెప్పగలరా. ఇందిరా కాంగ్రెస్‌లో ఇండియా కాంగ్రెస్‌ను విలీనం చేసిన చరిత్ర మీది. కాంగ్రెస్ ఎల్పీ విలీనం తప్పు అంటే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ను అవమాన పరిచినట్లు కదా అన్నారు.

టిఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు స్పీకర్ను అధికార నివాసంలో తీర్మాన పత్రంలో సంతకాలు పెట్టి స్పీకర్కు అందజేశారు.వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోతే ఎలా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ నేతల తీరు అలా ఉంది.ప్రతిపక్షంగా వివరించడం చేతకాకపోతే అది మీ కర్మ మీరు అసమర్ధులు ఐతే ఎవరు ఏం చేస్తారని ఆయన అన్నారు.

ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల హక్కులను కాలరాసే విధంగా మాట్లాడుతున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వచ్చారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలే కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడం లేదని ఎద్దేవ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజల మద్దతుతో 32 జిల్లా పరిషత్‌లో టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో, శాసనసభాపక్షనేత బట్టి నియోజకవర్గంలో మెజార్టీ జడ్పీటీసీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుందని తెలిపారు. పార్టీ మారిన నేతలను సంతలో పశువుల్లా అమ్ముడుపోయి ఉన్నారని దళిత నేతలను అవమానిస్తున్నారు. ఎమ్మెల్యే లకు ఉన్న రాజ్యాంగబద్ధ హక్కుల ద్వారానే శాసనసభ పక్ష నేత టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలు నైనా కాపాడుకోండి పనికి మాలిన విమర్శలు మానుకోండి. అని సత్యవతి రాథోడ్‌ హితవు పలికారు.

- Advertisement -