రవి ప్రకాష్‌కు మరోసారి పోలీస్‌ నోటీసులు..

252
Ravi Prakash
- Advertisement -

నిధుల మళ్లింపు, ఫోర్జరీ కేసులో టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు బంజారాహిల్స్‌ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. ఈరోజు 41 సీఆర్‌పీసీ కింద పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రవి ప్రకాష్‌ రేపు (శుక్రవారం) విచారణ నిమితం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేసన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

కాగా 27 రోజుల పాటు పరారీలో ఉన్న ఆయన ఇటీవల సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. అయితే,గత రెండు రోజుల విచారణలో రవిప్రకాశ్‌ పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా.. వారి ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడంలేదని తెలుస్తోంది.

Ravi Prakash

అయితే ఫోర్జరీ,నిధుల మళ్లింపుపై కంపెనీ రికార్డులను పరిశీలించగా, ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఏబీసీఎల్, మీడియా ఎన్‌ఎక్స్‌టీ ఇండియా (మోజో టీవీ)కి మధ్య రూ.99 వేలకు లావాదేవీ జరిగినట్టు ఉన్నదని తెలిపారు. దీనిపై ఆరాతీస్తే.. ఏబీసీఎల్ సంస్థకు.. ఈ ఏడాది జనవరి 22న కొన్ని రిపేర్లు, మెయింటెనెన్స్ పనులు చేసినందుకు మీడియా ఎన్‌ఎక్స్‌టీ రూ.99 వేలు చెల్లించినట్టు ఉన్నదని తెలిపారు.

ఈ లావాదేవీని తప్పుడు తేదీలతో మార్చి, కాపీరైట్స్, ట్రేడ్‌మార్క్‌లను విక్రయించినట్టుగా సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌశిక్‌రావు ఫిర్యాదు మేరకు ఐపీసీ 467, 420, 409, 406, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

- Advertisement -