రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇందుకోసం రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ని నియమించారు. గురువారం కోల్‌కతాలో దీదీతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ జగన్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. జగన్‌కు ఎప్పటికప్పుడు సూచనలు,సలహాలు ఇస్తూ వైసీపీకి తిరుగులేని మెజార్టీని కట్టబెట్టారు. గత రెండేళ్లుగా ఏపీ రాజకీయ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. వ్యూహాల నుంచి ప్రచారం వరకు జగన్‌తో పాటు శ్రేణులను ముందుండి నడిపించారు.
జేడీయు ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ‘ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్)’గా పేరుంది. 2014లో మోడీ విజయంలో కీలకపాత్ర పోషించారు ప్రశాంత్ కిషోర్. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థుల వైఖరిని ఎండగట్టడంలో సిద్ధహస్తుడు. అందుకే ప్రశాంత్‌ని తృణమూల్ రాజకీయ వ్యూహకర్తగా నియమించారు దీదీ.