ప్రగతి భవన్ లో 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…

384
Trs Congres
- Advertisement -

ప్రాదేశిక పోరులో తగిలిన ఎదురుదెబ్బ నుంచి ఇంకా కొలుకొకుండానే కాంగ్రెస్‌కు వరుస షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇటివలే ఆ పార్టీ కి 11మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా..తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. తాండూర్ ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నినన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 7కు పడిపోయింది. ఈ నేపథ్యంలో 18 మందిలో మూడొంతుల మంది అంటే 12 మంది టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనమయ్యేందుకు అంగీకరిస్తూ స్పీకర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నారు. ఇందుకు 12మంది ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు చేరుకుని సీఎం కేసీఆర్ తో చర్చిస్తున్నారు.

గతంలో అసెంబ్లీలో, శాసన మండలిలో టీడీపీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసినప్పుడు పాటించిన ప్రక్రియనే పాటించనున్నారు. ప్రగతి భవన్ కు వచ్చిన వారిలో సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం), జాజాల సురేందర్(ఎల్లారెడ్డి), రేగా కాంతారావు(పినపాక), కందాల ఉపేందర్ రెడ్డి(పాలేరు), హరిప్రియ(ఇల్లందు), వనమా వెంకటేశ్వరరావు(కొత్తగూడెం), చిరుమర్తి లింగయ్య(నకిరేకల్), దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(ఎల్బీనగర్), ఆత్రం సక్కు(ఆసిఫాబాద్), హర్షవర్ధన్ రెడ్డి(కొల్లాపూర్), గండ్ర వెంకటరమణారెడ్డి(భూపాలపల్లి), పైలెట్ రోహిత్ రెడ్డి(తాండూరు). ఇక కాంగ్రెస్ మిగిలింది ఆరుగురు మాత్రమే. వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నారు.

- Advertisement -