- Advertisement -
విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి వెంకీమామ అనే మల్టీస్టారర్ మూవీ నటిస్తున్నారు. ఈచిత్రానికి ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తాజాగా ఉన్న సమాచారం మేరకు వెంకటేశ్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. నేను లోకల్ సినిమా దర్శకుడు త్రినాథ రావు నక్కిన దర్శకత్వం ఓ సినిమా చేయనున్నారు. ఇక మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు వెంకీ.
యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తో కూడా సినిమా చేయనున్నట్లు తెలిపాడు. త్వరలోనే ఈసినిమా ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఇవి కాకుండా ఈమధ్యే విడుదలై మంచి విజయాన్ని సాధించిన బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’ను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే నిర్మాత సురేష్ బాబు కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -