ఆ పదవి నాకు వద్దు..చంద్రబాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ ఎంపీ

255
Kesieni nani
- Advertisement -

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలు గెలుపొందారు. విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు ముగ్గురు విజయం సాధించారు. అయితే ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్ ను, అలాగే లోక్ సభ ప్లోర్ లీడర్ గా రామ్మోహన్ నాయుడుని నియమించారు చంద్రబాబు.

అయితే సీనియర్ నేత అయిన కేశినేని నానిని మాత్రం పార్టీ విప్ గా ప్రకటించారు. అయితే ఈపదవి తనకు వద్దని చంద్రబాబుకు లేఖ రాశారు ఎంపీ కేశినేని నాని. తాను ఈపదవి స్వీకరించలేనని, తాను ఈ పదవి స్వీకరించలేనని, తాను అంత సమర్ధుడిని కాదని పార్టీలో సమర్ధవంతమైన నేతలకు పదవులు ఇవ్వాలంటూ సూచించారు.

పార్టీ విప్ పదవికంటే ప్రజలకు సేవ చేసుకోవడమే తనకు ఇష్టం అని చెప్పారు. నాకు ఈ పదవి ఇచ్చినందుకు చంద్రబాబకు కృతజ్నతలు తెలుపుతూ.. అలాగే పదవి తిరస్కరిస్తుంన్నందుకు క్షమాపణలు చెబుతున్నానంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు ఎంపీ కేశినేని నాని. అలాగే తాను బీజేపీలో చేరుతానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు.

- Advertisement -