పవన్‌ను ఓడించాడు..మంత్రి కాబోతున్నాడు..!

389
pawan grandhi srinivas
- Advertisement -

ఏపీ కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. సీనియర్లు, జూనియర్లు, సామాజిక సమీకరణాలు, జిల్లాల ప్రాతినిధ్యం కలబోతగా ఉండబోతోందని ఇప్పటికే జగన్ తన సన్నిహితులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 8న తన కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. విశాఖలోని శారదపీఠాన్ని సందర్శించిన జగన్‌ కేబినెట్ విస్తరణకు ముహుర్తాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

దీంతో కేబినెట్ ఆశావహులంతా జాబితాలో తమ పేరు ఉందో లేదో చెప్పాలంటూ పార్టీ పెద్దలను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు పలు జిల్లాల్లో గెలిచిన సీనియర్ శాసనసభ్యులకు, మాజీ మంత్రులకు, గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో పనిచేసిన వారికి జగన్ కచ్చితంగా అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు.

పాదయాత్రలో హామీ ఇచ్చిన వారితో పాటు కీలకనేతలను ఓడించిన వారికి కేబినెట్‌లో చోటు దక్కనుంది. భీమవరంలో పవన్‌ కళ్యాణ్‌పై విజయం సాధించిన గ్రంధి శ్రీనివాస్‌కు కేబినెట్‌ బెర్త్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇక నారా లోకేశ్‌ని ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి బెర్త్ దాదాపు ఖరారైంది.

వీరితో పాటు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్ధసారథి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్లు కన్ఫామ్‌ అయినట్లు తెలుస్తోంది.

కేబినెట్ విస్తరణలో చోటు దక్కని వారికి శాసనసభ పదవుల్లో నియమించేలా జగన్ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఛీఫ్ విప్ తో పాటు నలుగురు విప్ లను నియమించే అవకాశం కనిపిస్తోంది. తిరుపతి నుంచి గెలిచిన భూమన వంటి వారికి టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవి కట్టబెట్టే అవకాశముంది.

- Advertisement -