- Advertisement -
టీటీడీ చైర్మన్ పదవి సినీ నటుడు,వైసీపీ నేత మోహన్ బాబును వరించనుందని వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు మోహన్ బాబు. సోషల్ మీడియాలో,పలు వెబ్ సైట్లలో వస్తున్న వార్తలు పుకార్లేనని తెలిపిన ఆయన ఇలాంటి వదంతులు రాయొద్దని కోరారు.
ఈ విషయంలో కొన్నిరోజులుగా తనకు ఫోన్లు వస్తున్నాయి…కానీ నా కోరిక ఒక్కటే. జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను అని తెలిపారు. ఆయన చేసే ప్రజాసేవకు నా వంతు సాయం చేయాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. జగన్‌పై నమ్మకంతోనే పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చానని తెలిపిన మోహన్ బాబు ఎలాంటి పదవులు ఆశించి వైసీపీలో చేరలేదని స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు మోహన్ బాబు. గతంలో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన ఆయన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
- Advertisement -