- Advertisement -
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు బెయిల్ పిటీషన్ సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. సంతకం ఫోర్జరీ కేసులో విచారణకు హాజరు కావాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం (జూన్ 3) విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకే వెళ్లాలని న్యాయస్థానం ఆయనకు సూచించింది. ఈ పిటిషన్‌పై మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీచేసింది.
ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ మంగళవారం నాడు హాజరయ్యారు. 41 ఏ నోటీసు కింద పోలీసుల విచారణకు హాజరుకావాల్సిందేనని సోమవారం నాడు సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో ఇవాళ రవిప్రకాష్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు.
- Advertisement -