హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫలక్‌నుమా దాస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు దర్శకుడు సుకుమార్. ఫలక్‌నుమా దాస్ సినిమా చూశానని తెలిపిన దర్శకుడు సుకుమార్ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యానని తెలిపారు. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసిన సుకుమార్ ఇప్పటివరకు హైదరాబాద్‌ను ఏదర్శకుడు ఇంత అద్భుతంగా చూపించలేదన్నారు. తాను హైదరాబాద్ అందాలను ప్రపంచానికి చూపిద్దామని ట్రై చేశానని కానీ తన వల్లకాలేదన్నారు. ఫస్ట్ సినిమానే విశ్వక్ సేన్ ఇంత కొత్తగా చేయడం బాగుందన్నారు.
సినిమాలో అంతా కొత్త ఆర్టిస్టులే చివరికి చిన్నపిల్లాడిచేత డైలాగ్ చెప్పించిన అద్భుతంగా వచ్చిందన్నారు. ఫలక్‌నుమా దాస్ చాలా ప్రొఫెషనల్‌గా నేచురల్‌గా ఉందన్నారు. ట్రైలర్ చూసి ఎ సర్టిఫికేట్ సినిమా అంటే ఎలా ఉంటుందో అని అనుకున్నా కానీ ఎక్కడా ఎ సర్టిఫికేట్ సినిమాలా అనిపించలేదన్నారు. సినిమా బాగుంది మీరు కూడా తప్పకుండా చూడండి అంటూ దర్శకుడు తెలిపారు.
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఫలక్ నుమా దాస్ మే 31న విడుదలైన విషయం తెలిసిందే. ప్రీమియర్ షోలతోనే భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం నైజాంలో సత్తాచాటింది. మూడు రోజుల్లో కోటిన్నరకు పైగా షేర్ కలెక్ట్ చేసి నైజాం దాదా అయ్యింది ఫలక్ నుమా దాస్.