- Advertisement -
గత కొద్ది నెలల క్రితం యాదాద్రి జిల్లా హాజీపూర్‌లో శ్రీనివాస్ రెడ్డి అనే యువకుడు అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడి, వారిని కిరాతకంగా అంతమొందించిన విషయం తెలిసిందే. హాజీపూర్ గ్రామంలో ఓ బావిలో వరుసగా ఒక్కో అమ్మాయి మృతదేహం ఆనవాళ్లు లభ్యం కావడం సంచలనంగా మారింది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.
ప్రస్తుతం అతడిని మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మరోక ఆధారం లభించింది. బొమ్మలరామరంలోని కర్కాలమ్మ కుంటలో మర్రి శ్రీనివాస్ రెడ్డి చేతిలో చనిపోయిన మనిషా డిగ్రీ విద్యార్థిని యొక్క ఆధార్ మరియు కల్పన ఐడీ లభించింది. శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో మనిషా యొక్క ఫోన్ కోసం వెతుకుతున్నారు పోలీసులు.
- Advertisement -