గవర్నర్ తో భేటీ అయిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

381
cmkcrmeeting
- Advertisement -

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ ఇవాళ సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. జగన్ విజయవాడ నుంచి ప్రత్యేక హోదాలో హైదరాబాద్ చేరుకోగా..సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి రాజ్ భవన్ కు చేరుకున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఉమ్మడి రాజధానిలోని సంస్థల ఆస్తులు, ఉద్యోగుల విభజన, కార్యాలయాల అప్పగింత తదితర సమస్యలపై మాట్లాడనున్నారు.

సమస్యలన్నింటినీ సానుకూల వాతావరణంలో పరిష్కరించుకోవాలనే ఆలోచనతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ సమక్షంలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం రంజాన్ సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే ఇఫ్తార్ విందులో సీఎంలిద్దరూ పాల్గొననున్నారు.

- Advertisement -