తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి గెలుపొందిన బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌కు ప్రస్తుత ఎంపీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. గెలిచినా.. ఓడినా.. నాజీవితం ప్రజాసేవకే అంకితం అని తెలిపారు. నిజామాబాద్ ప్రజల కోసం ఎప్పుడూ పోరాడుతానని, వారి సమస్యల మరిష్కారానికి ముందుంటానని… అలాగే గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే అవకాం ఇచ్చినందుకు నిజామాబాద్ ప్రజలకు ధన్యవాదాలు అని ఎంపీ కవిత ట్విటర్ ద్వారా తెలిపారు.
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ 9 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం ఒక స్థానం దక్కించుకొన్నాయి. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయాన్ని నమోదు చేయడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని భావించారు. ముఖ్యంగా టీఆర్ఎస్కు కంచుకోట అయిన కరీంనగర్లో సీనియర్ ఎంపీ బి. వినోద్‌కుమార్, నిజామాబాద్‌లో ప్రస్తుత ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత, అలాగే భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఆదిలాబాద్ ఎంపీ గడెం నగేష్ ఓడిపోయారు.
ఇక ఎంపీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 68 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అరవింద్‌కు 4,80,584 ఓట్లు, కవితకు 4,09,709 ఓట్లు వచ్చాయి. 69240 ఓట్లతో మధు యాష్కీ గౌడ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.
Win or lose, My life is dedicated to public.
I fought hard during T-agitation & as an MP worked sincerely for my constituency & will continue to fight for people of Nizamabad.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 23, 2019