సిద్దిపేటలో ప్రేమజంట బలవన్మరణం..

303
lovers suicide
- Advertisement -

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట బలన్మరణానికి పాల్పడింది. లకుడారం గ్రామానికి దచెందిన కనకయ్య(21),రాచకొండ తారా(19) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి విషయం తారా తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు.

రెండు సంవత్సరాల క్రితం పెద్దమనుషుల సమక్షంలో కనకయ్యకు 30 వేల జరిమానా విధించారు. అయినా వీరు తమ ప్రేమను మర్చిపోలేక పోయారు. కులాలు వేరు కావడంతో ఎప్పటికీ తమ ప్రేమను కుటుంబసభ్యులు ఒప్పుకొరని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

బుధవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఓ భవనంలోకి వెళ్లారు. తమ వెంట తెచ్చుకున్న విషం తాగి అనంతరం స్ధానిక పాఠశాల భవనంలోకి ఓగదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

బుధవారం నుండి వీరిద్దరు కనిపించకపోవడంతో స్ధానికులు లోపలికి వెళ్లి చూడగా ప్రేమికులు ఇద్దరు విఘతజీవులై కనిపించారు. మృతుడు కనకయ్య పదిరోజుల క్రితమే ఆంజనేయ స్వామి మాల ధరించాడు. ఇద్దరు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -