హ్యాంగోవరా… మందు బాబులకు ఇక రందీ లేదు..!

391
Hangover
- Advertisement -

భీకరమైన తలనొప్పి.. నోటిలో ఏదో చచ్చిపడి ఉన్న అనుభూతి..ఎవరితో మాట్లాడలేం..ఆ నొప్పి తగ్గేందుకు ఎన్నో ఫీట్లు..ఇప్పటివరకు హాంగోవర్‌తో మందుబాబులు పడే బాధ ఇది. ఇకపై వారికి శుభవార్త. హ్యాంగోవర్ ని తగ్గించే సహజసిద్ధమైన ఔషధం మార్కెట్లోకి వచ్చేసింది.

అల్కాహాల్ హ్యాంగోవర్ ను తగ్గించే సహజసిద్ధమైన డిటాక్స్‌ మార్నింగ్ ఫ్రెష్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది హెల్త్ లైన్ సంస్థ. మల్బరీ ఆకులు,విటమిన్ సి వంటి సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన డ్రింక్‌ బుధవారం మార్కెట్‌లోకి వచ్చింది. ఆయుర్వేద గుణాలతో తయారు చేసిన ఈ డ్రింక్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ ఉండవని కంపెనీ ప్రకటించింది.

ఇప్పటివరకు బెంగళూరు,చెన్నై,ముంబైలో విజయవంతమైన ఈ డ్రింక్‌ ఇకపై హైదరాబాద్‌లోని బార్లు,సూపర్ మార్కెట్లలో లభించనుంది. ఇందుకోసం బిగ్ బజార్‌,రత్నదీప్ వంటి రిటైలర్లతో హెల్త్ లైన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

60 మిల్లీలీటర్ల బాటిల్ ధర 125 కాగా మ‌‌ద్యం సేవించాక దీనిని తీసుకుంటే మ‌‌రునాడు ఉద‌‌యం ఎలాంటి హ్యాంగోవర్ ఉండ‌‌ద‌‌ని కంపెనీ తెలిపింది. లివ‌‌ర్‌‌లోని చెడుప‌‌దార్థాల‌‌ను శుభ్రం చేయ‌‌డం, అల్కాహాల్ త్వర‌‌గా జీర్ణమ‌‌య్యేలా చేయ‌‌డం ద్వారా ఇది హాంగోవ‌‌ర్‌‌ను తొల‌‌గిస్తుంద‌‌ని తెలిపింది.

- Advertisement -