విష్ణు ప్రియ ఇచ్చిన షాక్‌కు సుధీర్‌ కంటతడి..!

480
sudheer vishnu priya
- Advertisement -

సుడిగాలి సుధీర్.. జబర్దస్త్ కామెడీ ప్రొగ్రామ్ ద్వారా అందరికి సుపరిచితమైన ఆర్టిస్టు. జబర్దస్ద్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి వచ్చినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్. కమెడీయన్ గానే కాకుండా యంకర్ గా కూడా దూసుకుపొతున్నాడు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కూడా నటిస్తూ కెరీర్‌ను చక్కదిద్దుకునే పనిలో పడ్డారు.

ప్రస్తుతం సుధీర్ యాంకర్‌గా చేస్తున్న షో.. పోవే పోరా. కుర్రకారును విపరీతంగా ఆకట్టుకున్న ఈ షోద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు సుధీర్‌. ముఖ్యంగా ఈ షోలో తోటి యాంకర్‌ విష్ణు ప్రియపై వేసే సెటైర్లు అందరిలో నవ్వులు తెప్పిస్తాయి.

అయితే ఇప్పటివరకు విష్ణు ప్రియకు షాకిస్తూ వచ్చాడు సుధీర్. అలాంటి సుధీర్ చేత కన్నీళ్లు పెట్టించింది విష్ణు ప్రియ. పోవే పోరా లెటెస్ట్ ప్రొమోని విడుదల చేసింది మల్లెమాల. ఈ ప్రొమో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగగా చివరలో విష్ణు..ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు కంటతడి పెట్టాడు సుధీర్. ఆయన బర్త్ డే సందర్భంగా చీర్స్ ఫౌండేషన్‌ పిల్లలు,సుధీర్ తల్లిదండ్రులను పిలిచి షాకిచ్చింది. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన సుధీర్ కన్నీళ్లు పెట్టేశాడు. ప్రస్తుతం ఈ ప్రొమో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

- Advertisement -