`మను చరిత్ర` చిత్రం శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కాజల్ అగర్వాల్ క్లాప్ కొట్టగా.. సి.కల్యాణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అజయ్ భూపతి ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. సుధీర్ వర్మ, సాహు గారపాటి స్క్రిప్ట్‌ను అందించారు.
ఈ కార్యక్రమంలో కాజల్ అగర్వాల్, అనీల్ సుంకర్, రాజ్ కందుకూరి, అనీల్ కన్నెగంటి, మధుర శ్రీధర్, సాహు గారపాటి, కృష్ణ చైతన్య, కొండా విజయ్‌కుమార్, దర్శకులు రాధాకృష్ణ, శివ నిర్వాణ, సుధీర్ వర్మ, అజయ్ భూపతి సహా పలువురు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి, మేఘా ఆకాశ్ జంటగా నటిస్తున్నారు. భరత్ కుమార్.పి దర్శకుడు. గోపీసుందర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ మేనేజర్ రాన్సన్ జోసెఫ్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. ఆయనతో కలిసి ఎన్.శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఎమోషనల్ ఇన్ టెన్స్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి `ఫాలింగ్ ఇన్ లవ్ ఈజ్ ఏ పెయిన్‌ఫుల్ జాయ్` ట్యాగ్‌లైన్. డాలీ ధనుంజయ్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.