ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత దక్కించుకున్న సంగతితెలిసిందే. టాప్ 10 విమానాశ్రయాల్లో శంషాబాద్ 8వ స్ధానంలో నిలిచింది. ఈ సందర్భంగా కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్జీఐఏ ఉద్యోగులకు విషెస్ చెప్పిన కేటీఆర్ హైదరాబాద్ ఖ్యాతిని మరింత ఇముడింపచేశారని ట్వీట్ చేశారు.
2019 సంవత్సరానికి గానూ విమానాశ్రయాల ర్యాంకింగ్‌లను ఎయిర్‌హెల్ప్ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది. ఎయిర్‌పోర్టు ఆన్‌టైం నిర్వహణ, సేవల నాణ్యత, ఆహారం, షాపింగ్ అవకాశాల వంటివి పరిగణనలోకి తీసుకుని ఎయిర్‌హెల్ప్ విమానాశ్రయాలకు ర్యాంకింగ్స్ ఇచ్చింది. 40 దేశాల్లోని 40వేల మంది ప్రయాణికులతో సర్వే జరిపి ఈ జాబితా రూపొందించింది.
ప్రపంచంలోనే అత్యుత్తమైన ఎయిర్‌పోర్టుగా ఖతార్‌లోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత జపాన్‌లోని టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం రెండు, గ్రీస్‌లోని ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మూడో స్థానంలో నిలిచాయి.