వివాదంలో సెక్సీ బాంబ్‌ రాఖీ సావంత్..!

598
Rakhi Sawant
- Advertisement -

వివాదాలకు పెట్టింది పేరు బాలీవుడ్ సెక్సీ బాంబ్ రాఖీ సావంత్. ఎప్పుడు ఎదో వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రాఖీ తాజాగా వివాదంలో చిక్కుకుంది. పాక్ జెండాను పట్టుకుని ఫోటోలకు ఫోజులివ్వడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.

ధారా 370 మూవీలో నా పాత్ర అంటూ పాకిస్థాన్ జెండాలను ఆస్వాదిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది రాఖీ. పాకిస్థాన్ జెండాను పట్టుకోవడమే కాకుండా దాన్ని తన గుండెలకు హత్తుకుని దిగడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రాఖీ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. అసభ్య పదజాలతో సావంత్ దుమ్ముదులిపారు.

దీంతో తాను పాక్ జెండా ఎందుకు పట్టుకున్నానో వివరణ ఇచ్చింది రాఖీ. ధారా 370 సినిమాలో పాకిస్థాన్‌కు చెందిన అమ్మాయి పాత్రలో తాను నటిస్తున్నానని, కశ్మీరి పండిట్స్ నేపథ్యంలో సినిమా ఉంటుందని రాఖీ వివరించింది. ఈ నేపథ్యంలో పాక్ జెండాతో ఫోటో దిగానని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో మాతృదేశంపై విపరీతమైన భక్తి కలిగిన అమ్మాయి పాత్రలో కనిపిస్తానని తప్పుగా అర్ధం చేసుకోవద్దని చెప్పింది. మరి ఇప్పుడైనా నెటిజన్లు శాంతిస్తారో లేదో వేచిచూడాల్సిందే.

- Advertisement -