- Advertisement -
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. మొదట కేరళకు చేరుకున్న సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. తిరువనంతపురంలోని క్లిఫ్ హౌస్‌లో సీఎం పినరయి విజయన్ తో చర్చిస్తున్నారు. ఈసందర్భంగా దేశంలో జరుగుతున్న రాజకీయాలపై చర్చిస్తున్నారు.
ఈ భేటీలో ఫెడరల్ ఫ్రంట్ గురించి కూడా చర్చించననున్నట్లు తెలుస్తుంది. లోక్‌సభ ఎన్నికలు, ఫలితాలు, దేశ రాజకీయాలపై ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు.
- Advertisement -