- Advertisement -
జీవీకే ఈఎంఆర్‌ఐలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌లో ఉన్న జీవీకే ఈఎంఆర్‌ఐలోని 108 వాహనాలు భారీ సంఖ్యలో దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 60 వాహనాలు దగ్ధమయ్యాయి. పాతపడిన, నిరుపయోగంగా ఉన్న 108 వాహనాలను పార్క్ చేసి ఉంచిన స్థలంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదానికి షాట్‌సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
- Advertisement -