విధుల్లో చేరిన వింగ్ కమాండర్ అభినందన్..

329
Wing Commander Abhinandan
- Advertisement -

భారత వైమానికదళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ తిరిగి విధుల్లో చేరారు.. విరామం అనంతరం అభినందన్ తిరిగి పైలట్ గా విధుల్లోకి చేరుతున్నట్లు జమ్మూ ఎయిర్ బేస్‌లో రిపోర్టు చేశారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్ ఎఫ్ 16 విమానాన్ని కూల్చి, పాకిస్థాన్ భూభాగంలో శత్రు సైన్యానికి చిక్కి, అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ పేరు దేశమంతటా మారుమోగింది. అయితే పాక్ చెర నుంచి విడుదలయ్యాక అభినందన్‌కు ప్రత్యేక వైద్య చికిత్సలు నిర్వహించారు. ఇటీవల పూర్తిగా కోలుకుని వాయుసేన పరీక్షల్లో ఫిట్‌గా తేలిన అభినందన్ తిరిగి విధుల్లో చేరారు.

Wing Commander Abhinandan

ఈ నేపథ్యంలో అభినందన్ జమ్మూకాశ్మీర్ లో తాను పనిచేస్తున్న ఎయిర్ బేస్ కు రాగా, సహోద్యోగులు ఘనస్వాగతం పలికారు. ఒక్కసారిగా చుట్టుముట్టి అభినందన్ ను ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. ఈ సాహస పైలట్ తో ఫొటోలు తీసుకునేందుకు పోటీలు పడ్డారు. అభినందన్ కూడా చాలా రోజుల తర్వాత తన సహచరులను చూసి భావోద్వేగాలకు లోనయ్యారు. వారితో ఎంతో ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా అక్కడ భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో హోరెత్తిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -