తొలి విడతలో 69 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం..

217
MPTCs Unanimous
- Advertisement -

రాష్ట్రంలో మరోసారి ఎన్నికల జరగనున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా మే 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తు ప్రారంభమైంది. తొలివిడత ఎన్నికల పోలింగ్ మే6న జరగనుంది. ఈ నేపథ్యంలో తొలివిడత ప్రాదేశిక ఎన్నికల్లో 69 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

ఇందులో 67 స్థానాలు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకోగా…రెండు ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. తొలివిడతలో రెండు జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. ఈ రెండు జెడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. తొలి విడతలో మొత్తం 195 మండలాల్లోని 2 వేల 166 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే తొలివిడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియ నుంది. రేపు సాయంత్రం 5 గంటల తరువాత ప్రచారం చేయరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -