రిషితను సింధూశర్మకు అప్పగించండి:హైకోర్టు

236
sindhu
- Advertisement -

హైకోర్టు రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్‌రావు కుటుంబంపై ఆయన కోడలు సింధూ శర్మ న్యాయ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింధు శర్మ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. పెద్ద కూతురు రిషితను, సింధూ శర్మకు అప్పగించాలని తీర్పు వెలువరించింది.

వారానికి రెండు రిషితను తండ్రి దగ్గర ఉంచాలని సూచించిన న్యాయస్థానం శుక్రవారం సాయంత్రం రిషితను తీసుకెళ్లి సోమవారం ఉదయం తిరిగి తల్లికి అప్పగించాలని పేర్కొంది. జూన్ 4వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగించాలని ఆదేశించింది హైకోర్టు. వశిష్ట, సింధూ కలిసి ఉండేందుకు ఏకాభిప్రాయానికి వస్తే జూన్ 4న తమకు తెలపాలని సూచించింది.

తనను,తన భార్యను ఈ కేసు నుండి తప్పించాలన్న రాం మోహన్ రావు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే దీనికి కుదరదని కోర్టు స్పష్టం చేసింది.తదుపరి విచారణను జూన్ 4కు వాయిదా వేసింది.

- Advertisement -