రామానాయుడు,దిల్ రాజు నాకు ఆదర్శం..

288
Producer Bekkam Venu Gopal
- Advertisement -

డబ్బుండి కాదు.. ప్యాషన్ ఉండి నిర్మాతగా ఎదిగిన వ్యక్తి బెక్కం వేణుగోపాల్.. టీవీ ప్రొడక్షన్ మేనేజర్ గా,కెమెరా అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టిన వేణుగోపాల్ ప్రస్తుతం చిన్న సినిమాల సక్సెస్ ఫుల్ నిర్మాతగా రాణిస్తున్నారు. ‘మేం వయసుకు వచ్చాం’ దగ్డరనుండి ఆయన చేస్తున్న ప్రయాణం ప్రస్తుతం చాలా ‘‘హుషారు’’గా సాగుతుంది. ఈ యేడాది మూడు సినిమాలు విడుదల చేయాలన్నది లక్ష్యంగా పనిచేస్తున్న బెక్కం వేణుగోపాల్ తన పుట్టిన రోజు( 27.04. 19) సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.

హుషారుకి ఎక్కవు టెంన్షన్ పడ్డాను:

ఇప్పటి వరకూ చేసిన సినిమాలు వేరు, ‘‘హుషారు’’ వేరు అందుకే ఆ సినిమా రిలీజ్ ముందు ఎక్కువ టెన్షన్ పడ్డాను. ఇలాంటి సినిమా చేసాడేంటి అంటారనేది నన్ను ఎక్కువ ఒత్తిడికి గురిచేసింది.అలాంటిది శుక్రవారం సినిమా రిలీజ్ అయితే ఆదివారంకు థియేటర్స్ అన్నీ ‘‘హుషారు’’తో నిండిపోయాయి.డబ్బులు వచ్చే సినిమా ఇచ్చావని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబీటర్స్ అంటుంటే చాలా గర్వ పడ్డాను. ‘‘హుషారు’’ సక్సెస్ నాకు కొ్ండంత ధైర్యాన్నిచ్చింది. కొత్త వాళ్ళతో సినిమా తీసి హిట్ కొడితే ఆ కిక్ ఎక్కువుగా ఉంటుంది.

Producer Bekkam Venu Gopal

నా ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ అదే:

నేను చేసే సినిమాలు ప్రేక్షకులు ఎందుకు చూడాలి అనే ప్రశ్న నేను ప్రతి సందర్భంలోనూ వేసుకుంటాను. అందుకే నా డబ్బులు తిరిగి రావాలంటే ఖచ్చితంగా సినిమా బాగుండాలి అనే పాయింట్ తోనే వర్క్ చేస్తాను. ఫొటో షూట్స్, టీజర్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తాం. సినిమా రిలీజ్ కి ముందే ఆ సినిమా చూడాలని అనే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు చేస్తాం ఆ భయం నుండే హిట్స్ వస్తాయిని అనుకుంటున్నాను.

అది కేవలం అపోహా మాత్రమే:

చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం లేదన్నది అపోహ మాత్రమే, ఆ కొరత కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది. ఈ యేడాది ఇప్పటి వరకూ చాలా థియేటర్స్ మంచి సినిమాల కోసం ఎదురు చూసాయి. సినిమా బాగుంటే మన సినిమా అన్ని థియేటర్స్ లో కనపడుతుంది.

చిన్న సినిమా పెద్ద సినిమాకాదు ఆడే సినిమా చేయాలనుకుంటాను:

నిర్మాతగా చిన్న సినిమా కే నాకు ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే పోతే మొత్తం పోతుంది. పెద్ద వాళ్ళ కోసం ప్రయత్నిస్తున్నాను. కథ దొరికితే తప్పకుండా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తాను. కథలను జడ్జ్ చేయడం, రైట్ పర్సన్స్ ని ఆ ప్రాజెక్ట్ కి ఎంచుకోవడం , రిలీజ్ కి ముందే సినిమా మీద ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడం ఈ విషయాలలో నేను ఎక్కువ జాగ్రర్త పడతాను. యాక్షన్, కమర్షియల్ సినిమాలు చేయాలంటే కొంచెం భయపడతాను. ఫార్ములాలకు వ్యతిరేకం కాదు కానీ కొత్తదనం తో ఎక్కువుగా ప్రయత్నించేందుకు ఇష్టపడతాను.

దిల్ రాజు, రామానాయుడు నాకు ఆదర్శం:

నిర్మాతగా రామానాయుడు, దిల్ రాజు గార్లంటే నాకు ఆదర్శం. సినిమా కోసం ఎంత కష్ట పడవచ్చో వాళ్ల దగ్గరనుండి నేర్చుకుంటాను. అన్ని విభాగాలను హ్యాండిల్ చేస్తూ కథలను జడ్జ్ చేస్తూ వాళ్ల పనితీరు నాకు నచ్చుతుంది. సినిమా మీద ప్యాషన్ తోనే దిల్ రాజు గారు నేను భాగస్వామ్యులం అయ్యాం. ‘‘నేను లోకల్’’ చేసాం. ఇప్పుడు రాజతరుణ్ హీరోగా ‘‘ఇద్దరి లోకం ఒకటే’’ చేస్తున్నాం.

శివాజీ పోలిటికల్ గా అంత రేంజ్ కి వెళతాడని అనుకోలేదు.

నటుడు శివాజీ, నేను కలిసే ట్రావెల్ చేశాం.మంచి మిత్రులం కూడా..నాకు ఇప్పటికీ టచ్ లో ఉంటాడు. పొలిటికల్ గా చాలా నాలెడ్జ్ ఉంది. మాట్లాడే కెపాసిటీ ఉంది. రాజకీయాల గురించి నాతో మాట్లేడేవాడు కానీ ఇంత రేంజ్ కి వెళతాడని అనుకోలేదు.

ఈ యేడాది మూడు సినిమాలు రిలీజ్ చేయాలనుకుంటున్నా:

ఈ యేడాది లక్కీ మీడియా బ్యానర్ నుండి కొత్త హీరోని లాంచ్ చేస్తున్నాం. మూడు సినిమాలు విడుదల చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. సినిమాలో పూర్తిగా నా ఇన్వాల్ మెంట్ ఉంటుంది. అది కూడా చాలా పాజిటివ్ గా ఉంటుంది. నక్కిన త్రినాథరావు,పవన్ సాదినేని, హర్ష లాంటి ప్రతిభ కలిగిన దర్శకులకు నా బ్యానర్ నుండి బ్రేక్ రావడం చాల ఆనందంగా ఉంటుంది. ‘‘హుషారు’’ తర్వాత చాలా యూత్ పుల్ సినిమాలు చేసేందుకు హుషారు వచ్చింది. ఎక్కడికి వెళ్లినా ఆ సినిమాలోని ‘‘ఉండిపోరాదే’’ సాంగే వినిపిస్తుంది.. నన్ను అందరూ ‘‘ఉండిపోరాదే నిర్మాత’’ అంటుంటే గర్వంగా ఉంది. అంటూ ముగించారు.

- Advertisement -