అప్పటి వరకూ నా బట్టలు నేనే ఉతుక్కునేవాడినిః మోదీ

311
modiiaksahhh1a
- Advertisement -

తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే వరకూ తన బట్టలు తానే ఉతుక్కునే వాడినని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇవాళ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు ప్రధాని మోదీ. ఎక్కడికెళ్లినా విడిచిన దుస్తులు ఉతికి ఆరేసుకునే అలవాటు తనకు ఉండేదని చెప్పారు. సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు.

ఖాళిగా ఉన్నపుడు తాను సాయంత్రం 5గంటల కల్లా డిన్నర్ పూర్తి చేస్తానని తెలిపారు. నేను మూడున్నర గంటలకు మించి నిద్రించను. ఎక్కువ సమయం నిద్రించాలని చాలా మంది నాకు చెప్పారు. కానీ.. నాకు అది అలవాటైపోయింది. రిటైర్మెంట్ తర్వాత నిద్రపై దృష్టిపెడతాను.

సోషల్ మీడియా అంటే నాకు చాలా ఇష్టం. నాపై ఎవరైనా సెటైర్లు వేస్తే ఆనందిస్తా. దాంట్లో వాళ్ల క్రియేటివిటిని చూస్తానని చెప్పారు. ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు వెళ్లి మా అమ్మను కలుస్తుంటానని..ఇప్పటికి మా అమ్మను తనకు డబ్బులు ఇస్తుందని తెలిపారు. నేను ఎప్పుడూ టీమ్‌గా ఆడే ఆటల్నే ఇష్టపడతానన్నారు.

- Advertisement -